సీఎం కేసీఆర్ ఇలాకాలో తూప్రాన్ మున్సిపల్ ఆఫీసులో మహిళలకు మెప్మా ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ నిమిత్తం సోమవారం మహిళలను పిలిచారు. అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మహిళలను కింద కూర్చోబెట్టి శిక్షణ తరగతులపై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నప్పటీకీ అధికారుల నిర్లక్ష్య వైఖరితో అప్రతిష్ట పాలవుతుందని మహిళలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కింద కూర్చోబెట్టి చిన్నచూపు చూడటంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శిక్షణ తరగతుల కార్యక్రమంలో మెదక్ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ప్రతిమాసింగ్, మెప్మా పీడీ ఇందిరా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గోపీనాథ్ రెడ్డి, సీవో హస్య ఉన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.